ETV Bharat / city

Rats Biting The Patient: వరంగల్​ ఎంజీఎంలో కలకలం... రోగిని కొరికిన ఎలుకలు - mgm hospital latest news

rats biting the patient: ఎవరైనా వ్యాధిని నయం చేసుకునేందుకు ఆస్పత్రికి వెళతారు. మరి రోగానికి చికిత్స అందించాల్సిన చోటే అనారోగ్యంగా మారితే పరిస్థితి ఏర్పడితే అది ఆస్పత్రి దర్భర పరిస్థితికి నిదర్శనం. ప్రస్తుతం వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి ఇదే. వైద్యం కోసం వేళ్లిన రోగిని ఏకంగా ఐసీయూలోనే ఎలుకలు కొరకడం అందరినీ కలవరపరుస్తోంది. ఆస్పత్రిలో ఎలుకలు రోగులను ఇబ్బంది పెడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

rats biting the patient:
ఐసీయూలో రోగిని కొరికిన ఎలుకలు
author img

By

Published : Mar 31, 2022, 12:20 PM IST

rats biting the patient: వైద్యనగరిగా తీర్చిదిద్దుతామన్న తెలంగాణలోని వరంగల్‌లో దారుణం జరిగింది. ఎంజీఎం ఆస్పత్రిలోని ఐసీయూలో ఓ రోగి కాళ్లు, చేతులను ఎలుకలు కొరకడం కలకలం రేపింది. ఐసీయూలో రోగి కాలు, చేతుల వేళ్లు ఎలుకలు కొరికేయగా.. బాధితుడు శ్రీనివాస్‌కు తీవ్ర రక్తస్రావమైంది. శ్రీనివాస్‌ ఆరోగ్య పరిస్థితి పట్ల కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల క్రితం శ్రీనివాస్‌ అనారోగ్యంతో ఎంజీఎంలో చేరారు. అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందే వ్యక్తిని వైద్యులు, సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తుంటారు. ఏ క్షణాన ఏమవుతుందోనని కనిపెట్టుకుని ఉంటారు. అలాంటిది ఓ రోగిని ఎలుకలు కొరికేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

rats biting the patient: వరంగల్‌కే తలమానికమైన ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరగడం పట్ల రోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తే ఐసీయూలోనే ఎలుకలు కొరికి గాయపరచడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి: Elephant Attack : పాపవినాశనంలో వాహనదారులను వెంబడించిన ఏనుగులు.. జోగివారిపల్లె పొలాల్లో రైతును తొక్కిన గజరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.