ETV Bharat / city

నెల వ్యవధిలో ముగ్గురు మృతి.. కీడు సోకిందని గ్రామం ఖాళీ - Superstition effect

Villagers left their homes: శాస్త్రసాంకేతిక విజ్ఞానం నేడు కొత్తపుంతలు తొక్కుతున్న కాలమిది. కానీ ఈరోజుల్లో కూడా మూఢ నమ్మకాలపై ప్రజల్లో ఇంకా అపోహలు తొలగలేదు. చాలా చోట్ల ఇంకా వాటిని పాటిస్తున్నారు. తాజాగా తెలంగాణ లోని కరీంనగర్ జిల్లాలో కూడా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

Jammikunta
Jammikunta
author img

By

Published : Sep 15, 2022, 8:31 PM IST

Villagers left their homes: నేటి ఆధునిక కాలంలో చంద్రుని పైన నివాసం ఏర్పరచుకునే దిశగా ప్రయోగాలు సాగుతున్న రోజులివి. కానీ ఇలాంటి రోజుల్లో మూఢనమ్మకాలతో నివాసాలు ఖాళీ చేయటం అనే విషయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. తెలంగాణ లోని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రామన్నపల్లిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఉదయమే గ్రామస్థులంతా తమ నివాసాలు విడిచి శివారులోని పంట పొలాలు, పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడే వంటలు చేసుకున్నారు.

ఈ గ్రామంలో నెల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. దీంతో తమ గ్రామానికి ఏదో కీడు సోకిందని భావిస్తూ సుమారు 300 కుటుంబాలు సాయంత్రం వరకు గ్రామాన్ని వదిలి పంట పొలాల్లోనే ఉండాలని నిశ్చయించుకున్నాయి. వేద పండితుల సూచన మేరకు గ్రామాన్ని విడిచి వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. అంతా బయటకు రావడంతో ఆ గ్రామం ఖాళీగా దర్శనమిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.