- పిల్లి సుభాష్ చంద్రబోస్
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పని చేస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ 1950 ఆగస్టు 8 తేదీన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య కేబినెట్లలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. వైఎస్ మరణనానంతరం వైసీపీలో చేరారు. 2015లో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైయ్యారు. ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం 2021 మార్చి వరకూ ఉంది.
- మోపిదేవి వెంకటరమణ
ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్లో మత్స్యశాఖ మంత్రి పని చేస్తున్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నానికి చెందిన మోపిదేవి 1962లో జన్మించారు. మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. రెండు సార్లు గుంటూరు జిల్లా కూచిపూడి నుంచి, ఓ సారి రేపల్లె నుంచి గెలుపొందారు. 1999, 2004లలో కూచిపూడి నియోజకవర్గం నుంచి, 2009లో రేపల్లె నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2019లో రేపల్లె నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను శాసనమండలి సభ్యుడిగా నియమించారు. శాసన మండలి సభ్యుడిగా ఆయన పదవీకాలం 2023 వరకూ ఉంది. 2009లో న్యాయశాఖ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా, 2010లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, 2019 జూన్ నుంచి పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా పని చేస్తున్నారు.
- ఆళ్ల ఆయోధ్యరామి రెడ్డి
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి రామ్ క్రీ గ్రూప్‌ను స్థాపించారు. 1994లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కీలకంగా మారింది. ప్రస్తుతం రామ్ కీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న అయోధ్యరామిరెడ్డి రామ్కీ గ్రూప్‌తో పాటు స్మిలాక్స్ ల్యాబ్స్, ట్రిడాక్స్ ల్యాబ్స్ , ఆర్.వ్యాక్ లిమిటెడ్ బోర్డు సభ్యులుగా ఉన్నారు.
- పరిమళ్ నత్వాని
గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వాని ఝార్ఖండ్ నుంచి రెండు మార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2008 నుంచి 12 ఏళ్లపాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కోర్ టీమ్‌లో పరిమళ్ నత్వానీ కీలకమైన వ్యక్తి . గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రిఫైనరీ కాంప్లెక్స్ నిర్మాణంలో పరిమళ్ నత్వానీ కీలక భూమిక పోషించారు.