రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో సోమవారం పొడి వాతావరణం ఉంటుందని, మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవొచ్చని వెల్లడించారు. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి తాజాగా ఝార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు వ్యాపించిందని వివరించారు.
ఇదీ చదవండి: