బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో ఇది మరింత బలపడుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. అల్పపీడనానికి తోడు
ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా..కోస్తాంధ్రలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇది మరింత జోరు ఇవ్వనుంది. నేటి నుంచి ఎల్లుండి వరకూ కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా పడొచ్చని వివరించారు.