బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరి కొన్ని గంటల్లో బలపడి.. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. అది రేపు కళింగపట్నం వద్ద తీరం దాటుతుందని.. వాతావరణ విభాగం బులెటిన్‌లో తెలిపింది. తుపాను ప్రభావంతో ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గోపాల్‌పూర్‌కు 580 కి.మీ. దూరంలో, కళింగపట్నానికి 660 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఈ రోజు రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు తెలిపారు. 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని అన్నారు. దీని ప్రభావంతో రాగల 3 రోజులపాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆదివారం అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. పశ్చిమబంగ-ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వెేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఇదీ చదవండి: MPP elections: ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ