రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో గురువారం కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించారు. రాయలసీమలో రెండు రోజుల పాటు అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ‘తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు తుపాను ప్రసరణ విస్తరించి ఉంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి ప్రవహిస్తోంది’ అని స్టెల్లా తెలిపారు.
నీ బుధవారం రాత్రి నుంచి రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.
ఇవీ చదవండి: