ETV Bharat / city

తెలంగాణాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం - hyderabad rain latest news

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు.

rains in hyderabad
తెలంగాణాలో వర్షాలు
author img

By

Published : Sep 19, 2020, 9:33 PM IST

రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్​గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్​నగర్​, నాగర్​ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈరోజు సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంచాలకులు పేర్కొన్నారు. రానున్న 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపారు.

ఇదీ చదవండి: నాగార్జునసాగర్ 12 క్రస్ట్​ గేట్లు ఎత్తి పులిచింతలకు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.