ETV Bharat / city

RAIN AT SECUNDERABAD: సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం.. నగర ప్రజలకు ఉపశమనం - నగరంలో చిరుజల్లులు

RAIN AT SECUNDERABAD: ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు వరుణుడు ఉపశమనం కలిగిస్తున్నాడు. తెలంగాణలోని హైదరాబాద్​ నగరంలో ఉక్కపోతకు అల్లాడుతున్న ప్రజలకు చిరుజల్లులు కురవడంతో కాస్త ఊరట పొందారు. హైదరాబాద్​లోని చాలాప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

author img

By

Published : Apr 30, 2022, 5:10 PM IST

సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

RAIN AT SECUNDERABAD: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. సికింద్రాబాద్, మారేడ్ పల్లి, చిలకలగూడ, బోయిన్​పల్లిలో వాన పడింది. ఎండల వేడిమి తాళలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కల్పించాడు. జీడిమెట్ల, గాజులరామారం, సూరారంలోనూ వాన చినుకులు కురిశాయి.

నగరంలోని తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, రాంగోపాల్ పేట్, ప్యారడైజ్, తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షం కురిసింది. నగరంలో చిరు జల్లులు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఇదీ చూడండి:

ఆర్మీ చీఫ్​గా జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు.. నరవణెకు వీడ్కోలు

ప్రికాషన్‌ డోసు కాల వ్యవధిపై కేంద్రం క్లారిటీ

గంటల్లో లక్షల కోట్లు కోల్పోయిన అమెజాన్​ బాస్​

కేటీఆర్ వ్యాఖ్యలు.. ఏపీ మంత్రుల కౌంటర్.. ఏవరేమన్నారంటే !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.