రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాతో పాటు.. మరో 39 మందికి రైల్వే కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 2వ తేదీ ఉదయం 10.30 గంటలలోపు విజయవాడలోని రైల్వే కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. కాపు రిజర్వేషన్ సాధన కోసం 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో సభ నిర్వహించారు.
ఆ క్రమంలో చెలరేగిన హింసాత్మక ఘటనలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనమైంది. అప్పట్లో 41 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే పోలీసు విభాగం, గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) నమోదు చేసిన పలు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆర్పీఎఫ్ కేసు పెండింగ్‌లో ఉంది. రైల్వే చట్టంలోని సెక్షన్లు 146, 147, 153, 174 (ఎ), (సి) కింద మునుపు కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి: