ETV Bharat / city

RRR LETTER TO CM: 'రాజకీయాల కోసం.. నీటి గొడవలు పెద్దవి చేయొద్దు' - ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదం

ముఖ్యమంత్రి జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది. ‘నవ సూచనలు’ పేరుతో ఆయన ఇవాళ మళ్లీ లేఖాస్త్రం సంధించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై వీలైనంత త్వరగా జలవివాదాలు పరిష్కరించాలని సూచించారు. నదీ జలాలపై సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

raghu rama letter to cm jagan
raghu rama letter to cm jagan
author img

By

Published : Jul 2, 2021, 10:46 AM IST

జగన్‌, కేసీఆర్‌ రాజకీయ అవసరాల కోసం రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు పెంచి పెద్దవి చేయొద్దని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. నవ సూచనల పేరిట ముఖ్యమంత్రి జగన్‌కు మరో లేఖ రాశారు. నదీ జలాలపై సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపిన జగన్‌.. జలవివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని రఘురామ ప్రశ్నించారు.

తెలంగాణలో ఉండే ఆంధ్రవారి గురించే ఆలోచిస్తున్నానని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధానికి లేఖలు రాయటం వల్ల సత్వర పరిష్కారం ఉండదన్న సంగతి జగన్‌కు తెలియంది కాదని.. తక్షణం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై వీలైనంత త్వరగా జలవివాదాలు పరిష్కరించాలని రఘురామ సూచించారు.

ఇదీ చదవండి:

JAGAN LETTER: ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం జగన్‌ లేఖలు

CM Letter To PM: 'ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.