చేపల కోసం విసిరిన వలలో.. కొండ చిలువ చిక్కిన ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచిలో జరిగింది. వలలో భారీ చేప పడిందనుకున్న మత్స్యకారులు.. అతి పెద్ద సర్పాన్ని చూసి ఉలిక్కిపడ్డారు.
సర్పాన్ని వల నుంచి విడిపించిన మత్స్యకారులు.. దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలి పెట్టారు. గత పదిహేను రోజుల క్రితమూ ఓ కొండ చిలువ ఇలాగే వలలో చిక్కుకున్నట్లు వారు తెలిపారు. వలలో తరచూ పాములు వస్తుండటంతో.. చెరువులోకి దిగాలంటేనే భయమేస్తోందంటూ వాపోయారు.
ఇదీ చదవండి: