Pulse Polio: పోలియో మహమ్మారిని తరిమేసేందుకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న (ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. పోలియో కార్యక్రమం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. పల్స్ పోలియోలో భాగంగా 0-5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ సెంటర్లు, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మూడు రోజుల పాటు..
"ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిబ్బంది వ్యాక్సిన్లు వేస్తారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు సోమ, మంగళవారం సిబ్బంది ఇంటింటికీ తిరిగి.. పోలియో చుక్కలు వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో మొత్తం 38 లక్షల మందికిపైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వైద్యారోగ్యశాఖతోపాటు ఐసీడీఎస్, విద్య, పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని.. తమ నియోజకవర్గంలోని కేంద్రానికి వెళ్లి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించాలి." - హరీశ్ రావు, వైద్యశాఖ మంత్రి
ఇదీ చూడండి: