ETV Bharat / city

కళ్ల నుంచీ కరోనా సోకుతుంది.. జాగ్రత్త: డాక్టర్ కె.శ్రీనాథ్​రెడ్డి - హైదరాబాద్​ తాజా వార్తలు

ప్రస్తుతం కరోనా వైరస్​ కళ్లలోంచీ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నందున అందరూ పూర్తిగా కప్పి ఉంచే కళ్లజోళ్లు ధరించడం మంచిదని... ప్రముఖ ప్రజారోగ్య నిపుణుడు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్​ రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాతే బలమైన రోగ నిరోధకశక్తి వస్తుందని అన్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో జనవరి నుంచి ప్రజల్లో పెరిగిన ఉదాసీనత వల్లే మళ్లీ వైరస్‌ వ్యాప్తి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

'పూర్తిగా కప్పి ఉంచే కళ్లజోళ్లు పెట్టుకోవడం మేలు'

author img

By

Published : Apr 19, 2021, 7:31 AM IST

Updated : Apr 19, 2021, 11:40 AM IST

corona through eyes
డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు

ప్రస్తుతం వైరస్‌లో వచ్చిన మార్పుల కారణంగా అది బలవంతంగా గడియ తీసి.. తలుపులు తెరుచుకొని ఇంట్లోకి చొరబడినట్లుగా మానవ కణజాలంలోకి ప్రవేశిస్తోందని ప్రముఖ ప్రజారోగ్య నిపుణుడు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది కళ్లలోంచీ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నందున అందరూ పూర్తిగా కప్పి ఉంచే కళ్లజోళ్లు ధరించడం మంచిదని సూచించారు.

వైరస్‌ ఏవైనా వస్తువులు, సామగ్రి ఉపరితలాల మీద పడి వాటిని ముట్టుకోవడం ద్వారా కంటే రోగుల నుంచి వెలువడే సూక్ష్మ తుంపర్ల ద్వారా (గాలిలో ప్రయాణించి) ఇతరులకు వ్యాపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో జనవరి నుంచి ప్రజల్లో పెరిగిన ఉదాసీనత వల్లే మళ్లీ వైరస్‌ వ్యాప్తి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని అడ్డుకోవాలంటే అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దేశంలో కొవిడ్‌ రెండో దశ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు గురించి తన అభిప్రాయాలను ‘ఈటీవీ భారత్‌’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

corona through eyes
మాస్కు తప్పనిసరి

కరోనా రెండో ఉద్ధృతికి కారణాలేంటి?

జనవరి తొలినాళ్ల నుంచి మనలో ఉదాసీనత పెరిగిపోవడమే. రోజువారీ కేసులు, మరణాలు, పాజిటివిటీ రేటు భారీగా తగ్గడంతో కరోనా అంతమైపోయిందని ఊహించుకున్నాం. దాంతో అందరిలో ఉదాసీనత వచ్చేసింది. ఈ ప్రాణాంతక వైరస్‌ను జయించే స్వాభావిక జన్యురక్షణ భారతీయులకు ఉందని, హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేసిందని కొందరు చేసిన వ్యాఖ్యలు కరోనా అంతమైందన్న నమ్మకాన్ని ప్రజల్లో మరింత పెంచాయి.

తొలిదశ వేగాన్ని లాక్‌డౌన్‌ అడ్డుకుందనుకోవచ్చా?

పలురకాల చర్యల కారణంగా తొలి దశలో కేసుల సంఖ్య తగ్గింది. లాక్‌డౌన్‌ విధించడం, ప్రయాణ ఆంక్షలను పెంచడం కూడా అందుకు కారణం. గత ఏడాది దీపావళి పండుగ రోజుల్లో కూడా భారీ జన సమూహాలు కనిపించలేదు. అయితే కరోనాపై విజయం సాధించినట్లు మనం తొందరపాటుగా ప్రకటించుకోవడం వల్ల ఆ క్రమశిక్షణ మటుమాయమైంది. దాంతో ప్రజలు భారీగా బంధుమిత్ర సమూహంతో వేడుకలు, కార్యక్రమాలు జరుపుకోవచ్చని, ఎన్నికలు నిర్వహించుకోవచ్చని భావించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు సరళమయ్యాయి. దాంతో వైరస్‌లో కొత్తరకం మార్పులు (న్యూవేరియంట్స్‌) వచ్చాయి.

వైరస్‌లో మార్పుల గురించి ప్రకటించడంలో యూకే జాప్యం చేసిందా?

అవును. కొత్త రకం వైరస్‌ గురించి ఆ దేశానికి సెప్టెంబరులో తెలిసినప్పటికీ ప్రపంచానికి డిసెంబరులో ప్రకటించింది. దాని జన్యుపరిణామ క్రమాన్ని విశ్లేషించడానికి మనం జనవరిలో కన్సార్షియాన్ని ఏర్పాటుచేసి దానిపై దృష్టి సారించడం ప్రారంభించాం. ఆ తర్వాత పెద్దసంఖ్యలో అవి కనిపించాయి. అందువల్ల మనం కేవలం ప్రయాణ విధానాన్ని (ట్రావెల్‌ పాలసీ) నిందించడం సరికాదు.

ఇప్పుడెందుకు వేగంగా వైరస్‌ సంక్రమిస్తోంది

యూకే రకం కొవిడ్‌ వైరస్‌ సంక్రమణ వేగం 60% అధికంగా ఉంది. దాని కొమ్ముల్లో వచ్చిన మార్పుల వల్ల (స్పైక్‌ ప్రొటీన్‌ మ్యూటేషన్స్‌) ఆ కొత్తరకం వైరస్‌ తేలిగ్గా మానవ కణజాలం తలుపులను తెరుచుకొని లోపలికి ప్రవేశించగలుగుతోంది. ఇందులో ఎస్‌2 అనే రిసెప్టర్‌ ఉంటుంది. స్పైక్‌ ప్రొటీన్‌ ఈ రిసెప్టర్‌కు అంటుకొని ఉంటుంది. ఇది తలుపు గడియను పట్టి తీసినట్లుగా మానవ కణజాలాన్ని తెరిచి లోపలికి చేరుతుంది. ఆ తర్వాత అక్కడి జన్యు యంత్రాంగాన్ని తన గుప్పెట్లోకి తీసుకొని తనకు ఇష్టమొచ్చినట్లు రూపాంతరం చెందడం ప్రారంభిస్తుంది. ఈ రకం వైరస్‌ (మ్యూటెంట్‌)తో పాటు, ఇతర రకాలు కూడా కొత్త స్పైక్‌ ప్రొటీన్‌ మ్యూటెంట్స్‌ని ఉపయోగించుకుంటూ రిసెప్టర్లకు గట్టిగా అతుక్కుపోగలుగుతున్నాయి. అందువల్ల వాటిని అక్కడి నుంచి తొలగించడం అంత సులభంగా సాధ్యం కావడంలేదు. ప్రస్తుతం దీనికున్న గుణం కారణంగా ఇన్‌ఫెక్షన్‌ కల్గించే సామర్థ్యం భారీగా పెరిగిపోయింది తప్పితే దాని సంక్రమణ వేగం వల్లకాదు.

వ్యాక్సినేషన్‌ ఎలా కొనసాగించాలి?

చిన్నచిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రస్తుతం తలెత్తిన రెండోదశ కరోనా ఉద్ధృతి నుంచి బయటపడాలంటే దేశంలో 35 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా అందించాలి. అయితే ఈ రెండోదశను అడ్డుకోవడానికి ఎంత శాతం జనాభాకు వ్యాక్సిన్‌ అందించాలన్నది చెప్పలేం.

వ్యాక్సిన్‌ రోగ తీవ్రతను అరికడుతుందా?

వాస్తవంగా అది ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించలేకపోయినా రోగ తీవ్రత, మరణం నుంచి మాత్రం కాపాడుతుంది. ఈ వ్యాక్సిన్లు క్రమబద్ధంగా రోగ నిరోధకశక్తిని ప్రేరేపిస్తాయి కాబట్టి వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాతే ఇవి పోరాటం ప్రారంభిస్తాయి. అంతే తప్ప వైరస్‌ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోలేవు. అందువల్ల వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత వైరస్‌ సోకితే కొంత అనారోగ్యం తలెత్తవచ్చు తప్పితే అది తీవ్రరూపం దాల్చలేదు. పైగా ఇది ఇన్‌ఫెక్షన్‌ రేట్‌ను కూడా తగ్గిస్తుంది.

ఒక్క డోస్‌ వ్యాక్సిన్‌ ప్రభావం ఏమైనా ఉంటుందా?

ఒక్క డోస్‌తో రోగ నిరోధకశక్తి స్థాయిని అంచనా వేయడం కష్టం. అది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత మనలో వైరస్‌కు వ్యతిరేకంగా బలమైన రోగ నిరోధకశక్తి ఏర్పడుతుంది.

రోగ నిరోధకశక్తి ఎంత కాలం ఉంటుంది?

వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న తర్వాత రోగ నిరోధకశక్తి ఎంతకాలం ఉంటుందన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. కొందరు ఆరు నెలలు అని చెబుతున్నారు. ఫైజర్‌ టీకా ప్రభావం ఏడాది ఉంటుందని, ఆ తర్వాత మరో డోస్‌ తీసుకోవాలని పేర్కొంటున్నారు. మనం అన్నింటినీ సూక్ష్మంగా గ్రహించాల్సి ఉంది. భవిష్యత్తులో వైరస్‌లో ఎలాంటి మార్పులొస్తాయన్నదీ చూడాలి.

విదేశీ టీకాలు ఎంతవరకు ప్రయోజనకరం?

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ ఒక్క డోసు తీసుకుంటే చాలు కాబట్టి మన లాంటి పెద్ద దేశంలో ఎక్కువమందికి అందించడానికి అది అనువుగా ఉంటుంది. కాని ఇప్పుడది ఆ దేశంలోనే కొన్ని సమస్యల్లో చిక్కుకొంది. కొన్ని ఇతర వ్యాక్సిన్లలో కనిపించినట్లుగా స్పుత్నిక్‌-వి వల్ల రక్తం గడ్డలు కట్టే పరిస్థితి ఉండదని రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొడెర్నా, ఫైజర్‌ ధరల విషయంలో మన ప్రభుత్వం అమెరికాతో సంప్రదింపులు జరపాలి. అనంతరం వాటిని దేశంలో ఎలా ఉత్పత్తి చేయాలో ఆలోచించాలి.

ఉపరితలాల ద్వారా కొవిడ్‌ సంక్రమిస్తుందా?

ఉపరితలాల పైనా వైరస్‌ ఉండొచ్చు. ముఖ్యంగా శీతల ఆహార పదార్థాలపై వైరస్‌ దీర్ఘకాలం మనగలుగుతుంది. అయితే అది విస్తరించలేకపోవచ్చు.. అందువల్ల ఉపరితల వైరస్‌ సంక్రమణకు అవకాశాలు చాలా తక్కువ. తుంపర్లు (డ్రాప్‌లెట్స్‌), గాలిలోకి వ్యాపించే సూక్ష్మ తుంపర్లు (ఏరోసోల్స్‌) ద్వారా సంక్రమించడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ రెండే ప్రధాన మార్గాలు. ఇప్పటివరకు నిర్వహించిన వాస్తవాధారిత పరీక్షల్లో ఉపరితల సంక్రమణం పెద్దగా కనిపించలేదు.

corona through eyes
వ్యాక్సినేషన్ తప్పనిసరి

సంప్రదాయ పద్ధతులు ఈ ఉద్ధృతిని అడ్డుకోగలుగుతాయా?

మాస్కు, శానిటైజర్‌, భౌతికదూరం, గుంపులకు దూరంగా ఉండటం ద్వారా వైరస్‌ను అడ్డుకోవచ్చని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. వైరస్‌కు మనం సంక్రమించే అవకాశాన్ని ఇచ్చి.. దానికి రాచమార్గాన్ని చూపిస్తే వేగంగా ప్రయాణిస్తుంది. ఒకవేళ ఎగుడుదిగుళ్ల దారి వేస్తే దాని వేగం తగ్గిపోతుంది. ఇక్కడ సంక్రమిస్తున్నది ఒరిజినల్‌ వైరస్సా? లేదంటే యూకే వైరస్సా? ఇంకొకటా అన్నది ముఖ్యం కాదు. ప్రస్తుతం వైరస్‌ కళ్ల నుంచి కూడా ప్రవేశించే అవకాశం ఉన్నందున ప్రజలు కళ్లజోళ్లు (గాగుల్స్‌) ధరించడం మంచిది. రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ క్రమశిక్షణగా ఉంటే తప్ప వైరస్‌ వ్యాప్తిని ఆపలేం. మనం క్రమశిక్షణ పాటించకుండా ఇది పోవడానికి 2 నుంచి 6 నెలలు పడుతుందని చెప్పడంలో అర్థం లేదు.

ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో లోపాలు కనిపించడానికి కారణం ఏంటి?

corona through eyes
ఆర్​టీపీసీఆర్ రెండు మాడు సార్లు చేయించుకుంటే మేలు

ఇందులో స్వాబ్‌ సేకరణ అన్నింటికంటే ముఖ్యం. ప్రజల నుంచి సేకరించిన స్వాబ్‌ను సరిగా రవాణా చేయకపోయినా, ప్రయోగశాలలో సరిగా నిల్వచేయకపోయినా అక్కడ చాలా తప్పులు జరిగిపోతాయి. దానివల్ల తప్పు రిపోర్ట్‌ వస్తుంది. అందువల్ల రెండు మూడుసార్లు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

"కరోనా రెండో దశ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా మాస్క్‌ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం వంటివి విధిగా అనుసరించాలి. కరోనా ఆనవాళ్లు లేని కొత్త సంవత్సరం కావాలంటే వైరస్‌ దావానలాన్ని రాజేసే సభలు, సమావేశాలు, వివాహాల్లాంటి సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.

వైరస్‌ నియంత్రణకు వ్యాక్సిన్‌ ఒక్కటే సరిపోదు. కేవలం వ్యాక్సిన్‌ను నమ్ముకొని వైరస్‌ను వ్యాప్తిచేసేలా సామూహిక కార్యక్రమాలను కొనసాగిస్తూ, మాస్కు లేకుండా బయట తిరుగుతూ పోతే మరో ఏడాది గడిచినా మహమ్మారి కబంద హస్తాల నుంచి బయటపడలేం.

2022వ సంవత్సరంలో మనం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైరస్‌ భయం లేకుండా స్వేచ్ఛగా జరుపుకోవాలంటే ప్రజారోగ్య చర్యలపరంగా, వ్యాక్సినేషన్‌పరంగా పూర్తి క్రమశిక్షణతో వ్యవహరించాలి. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 35 ఏళ్లపైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ అందుతుందని నేను విశ్వసిస్తున్నాను."

- పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి

ఇదీ చదవండి:

తిరుమలలో కరోనా నియమాలు పకడ్బందీగా అమలు

Last Updated : Apr 19, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.