అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలోని ప్రవాసాంధ్రుల సంఘం... అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపింది. జై అమరావతి.. ఆంధ్రులంతా ఒక్కటే... ఆంధ్రుల రాజధాని ఒక్కటే, అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ వారంతా నినాదాలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ప్రతిపాదన వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప ప్రజలకు ప్రయోజనం శూన్యమని... ఒక రాజధానితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు.

200 రోజులకుపైగా అలుపెరగక అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. అమరావతే రాజధానిగా ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు రాజధాని రైతుల ఉద్యమంలో భాగస్వాములుగా ఉంటామని తెలిపారు.
ఇదీ చదవండి: