ETV Bharat / city

'సీఆర్‌డీఏ చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్‌పై నిషేధం ఉంది' - Chandrababu Latest News

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు, నారాయణపై సీఐడీ కేసు దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలను... హైకోర్టు నాలుగు వారాల పాటు నిలుపుదల చేసింది. రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం, అథార్టీ, అధికారి, వ్యక్తి చేపట్టిన చర్యలపై దావా వేయడం, ప్రాసిక్యూట్ చేయడంపై... సీఆర్‌డీఏ చట్టం సెక్షన్ 146 ప్రకారం నిషేదం ఉందని గుర్తుచేసింది. పిటిషనర్లకు ఈ కేసులో ప్రాసిక్యూషన్ నుంచి నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాలపై లోతుగా విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది.

'సీఆర్‌డీఏ చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్‌పై నిషేధం ఉంది'

author img

By

Published : Mar 20, 2021, 5:05 AM IST

'సీఆర్‌డీఏ చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్‌పై నిషేధం ఉంది'

అమరావతి అసైన్డు భూముల విషయంలో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నాలుగు వారాలపాటు నిలిపివేసింది. రాజధాని నగర నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం, అథార్టీ, అధికారి, వ్యక్తి చేపట్టిన చర్యలపై దావా వేయడం, ప్రాసిక్యూట్‌ చేయడంపై సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం నిషేధం ఉందని గుర్తుచేసింది. దాంతో సీఐడీ విచారణ అర్హతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేశాక ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

దీనిలో పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు సీఐడీ అధికారులు నిర్వహించిన ప్రాథమిక విచారణలో సైతం కనుగొనలేకపోయారని గుర్తుచేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న మంగళగిరి సీఐడీ ఠాణా స్టేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి, ఫిర్యాదుదారయిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ వేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జాస్తి నాగభూషణ్‌ స్పందిస్తూ.. పిటిషనర్ల విషయంలో మాత్రమే దర్యాప్తుపై స్టే ఇచ్చారా? ఇతరుల విషయంలోనూ స్టే వర్తిస్తుందా అని అడిగారు. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల విషయంలో మాత్రమే స్టే ఇచ్చినట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు.

అమరావతి అసైన్డు భూముల విషయంలో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు తరఫున న్యాయవాది గింజపల్లి సుబ్బారావు, మాజీ మంత్రి పి.నారాయణ తరఫున న్యాయవాది ఎస్‌.ప్రణతి హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

‘రాజకీయ ప్రతీకారంతో పిటిషనర్లపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వం అన్నీ తప్పులు చేసిందనే ప్రచారంలో భాగంగానే తప్పుడు కేసు పెట్టింది. దీని వెనుక ప్రభుత్వ పెద్దలున్నారు. గతంలోనూ తెదేపా సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఫిర్యాదుదారు గతంలో చంద్రబాబుపై వేసిన కేసు సుప్రీంలో పెండింగ్‌లో ఉంది. రాజధాని నగర నిర్మాణం కోసం తీసుకొచ్చిన సీఆర్‌డీఏ చట్టం సెక్షన్‌ 18 దఖలుపరిచిన అధికారం ప్రకారం అసైన్డు భూముల సేకరణ, వాటి యజమానులకు ప్రయోజనాలు కల్పించేందుకు జీవో 41 తీసుకొచ్చారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ జీవో జారీకి నోట్‌ఫైల్‌ ప్రతిపాదన పంపారు. నిబంధనలను అనుసరించి, అప్పటి ఏజీ సలహా మేరకు జీవో జారీ చేశారు. 35 రోజుల తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి దాన్ని ధ్రువీకరించారు. జీవో 41 ప్రకారం వివిధ కేటగిరీ అసైన్డ్‌ భూయజమానులకు ప్రయోజనాలు కల్పించారు. జీవో జారీ వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవు. అలాంటప్పుడు అది నేరం ఎలా అవుతుంది? అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి నిందితులు ఎలా అవుతారు? జీవో ఇచ్చిన ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేయడం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధం. అసైన్డ్‌ భూములివ్వడం వల్ల నష్టపోయామని ఎస్సీ, ఎస్టీలు ముందుకు రాలేదు. అలాంటప్పుడు పిటిషనర్లపై కేసు ఎలా నమోదు చేశారు? వారిపై ఐపీసీ ప్రకారం పెట్టిన సెక్షన్లు వర్తించవు. జీవోపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానంలో సవాలు చేసుకోవాలి. రాజధాని నగర నిర్మాణం చర్యల విషయంలో ప్రభుత్వం, అథార్టీ, అధికారిపై ఎలాంటి దావా, ప్రాసిక్యూషన్‌ చేయడానికి వీల్లేదని సీఆర్‌డీఏ చట్టం సెక్షన్‌ 146 స్పష్టం చేస్తోంది. రాజధాని భూముల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ భావనే ఉత్పన్నం కాదని, ప్రైవేటు భూములు కొంటే నేరం కాదని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. జీవో 41 వల్ల ఎవరు నష్టపోయారో ఫిర్యాదులో కానీ, సీఐడీ ప్రాథమిక దర్యాప్తులో కానీ వెల్లడి కాలేదు. వీటన్నింటి దృష్ట్యా దర్యాప్తును నిలిపివేయండి…’ అని కోరారు.

దర్యాప్తును కొనసాగనివ్వండి: అదనపు ఏజీ

సీఐడీ తరఫున ఏఏజీ జాస్తి నాగభూషణ్‌ వాదనలు వినిపించారు. ‘జీవో 41 జారీ చేయడానికి సంబంధితశాఖ ముఖ్యకార్యదర్శి మాత్రమే బాధ్యులు, పిటిషనర్లకు ఏమీ సంబంధం లేదన్నట్లు వారి తరఫు న్యాయవాదులు చెప్పడం సరికాదు. క్యాబినెట్‌ నిర్ణయాన్ని, బిజినెస్‌ నిబంధనలను ఉల్లంఘించి అసైన్డు భూముల విషయంలో జీవో తీసుకొచ్చారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించలేదు. నిబంధనలను పాటించలేదు. ఉదాహరణకు నవులూరులో రికార్డుల ప్రకారం 70 ఎకరాల అసైన్డ్‌ భూములుంటే 105 ఎకరాలకు ప్లాట్స్‌ కేటాయించారు. తెదేపా అనుచరులకు ప్రయోజనం కల్పించారు. జీవో 41 జారీ ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిషేధ చట్టం నిబంధనలకు విరుద్ధమని తాను చెప్పినప్పటికీ ఆ విషయం ప్రభుత్వం చూసుకుంటుందని అప్పటి మంత్రి సమాధానపరిచారని నాటి కలెక్టర్‌ శుక్రవారం (19.3.2021) వాంగ్మూలం ఇచ్చారు. జీవో 41 ద్వారా అసైన్డు భూయజమానులు, సీఆర్‌డీఏకు నష్టం జరిగింది’ అన్నారు.

అసైన్డు భూయజమానులకు నష్టమేంటి?

న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘దీనిలో అసైన్డు భూయజమానులకు జరిగిన నష్టమేంటి? సీఆర్‌డీఏకు నష్టం కలిగితే ఫిర్యాదు చేయలేదుగా? ఎఫ్‌ఐఆర్‌లో సీఆర్‌డీఏ విషయంలో తప్పుగా వ్యవహరించారనే విషయం లేదు కదా’ అని ప్రశ్నించారు. అదనపు ఏజీ బదులిస్తూ.. దర్యాప్తు ప్రారంభదశలోనే ఉందని, దాన్ని కొనసాగిస్తే కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పారు. జీవో 41కి సంబంధించిన నిబంధనల గురించి శాసనసభలో చర్చ జరగలేదన్నారు. పిటిషనర్లపై దర్యాప్తును నిలువరించొద్దని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. బిజినెస్‌ నిబంధనలను ఉల్లంఘించి జీవో జారీ చేశారనుకున్నా, అది నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం పిటిషనర్ల ప్రాసిక్యూషన్‌పై నిషేధం వర్తిస్తుందని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. లోతుగా విచారణ జరిపి సీఐడీ ప్రాసిక్యూషన్‌కు విచారణార్హత ఉందా, లేదా తేలుస్తామన్నారు. సీఐడీ కేసులో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటిపైనా స్టే విధించారు.

ఇదీ చదవండీ... 'నాకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.