ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక (ఊపా) చట్టాన్ని ఎత్తివేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిన వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నిర్బంధ వాతావరణాన్ని సృష్టించారని సామాజిక ఉద్యమకారుడు ప్రొ.హరగోపాల్ వ్యాఖ్యానించారు. ఇందుకోసమేనా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకుందని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి మారాలని.. ప్రజాస్వామ్య వాతావరణం రావాలని సూచించారు. ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్టు చేయడం సరైంది కాదని అన్నారు. వరవరరావును బెయిల్‌పై విడుదల చేసేలా చూడాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ప్రజల పక్షాన పోరాడే వారికి ప్రజలు అండగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.