ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోటా అమలుతో ఇంజినీరింగ్‌లో రెండు వేలకుపైగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ వర్సిటీల్లో 35% సీట్లను కన్వీనర్ కోటాలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తాము నిర్వహించే ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇకపై వాటిలోని మొత్తం ఇంజినీరింగ్ సీట్లలో 35%... ఈఏపీసెట్ లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు. సాధారణ డిగ్రీ కోర్సులకు ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ సీట్లకు ఫీజులను ఉన్నత విద్యా కమిషన్ నిర్ణయిస్తుంది.
ఇదీ చదవండి: PULICHINTALA: స్టాప్‌లాక్ పనులు మొదలు..