ETV Bharat / city

"ఆ జీవో తక్షణమే ఉపసంహరించుకునేలా చూడండి" - గవర్నర్ బిశ్వభూషణ్ వార్తలు

రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీవో 2430పై నిరసన జ్వాల ఇంకా చల్లారలేదు. ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు ఈ విషయాన్ని ఏపీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఈ జోవోను ఉపసంహరించుకునేలా చూడాలని కోరారు.

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్​తో ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు
author img

By

Published : Nov 7, 2019, 9:18 PM IST

governor biswabhoosan
రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్​తో ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు

వివాదాస్పద జోవో 2430 విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్​ను ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కోరారు. రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసిన వారు ఈ మేరకు వినతిపత్రం అందించారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ జీవోపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీవో 2430 వల్ల కలిగే ఇబ్బందులను బిశ్వభూషణ్​కు వివరించారు. జీవో విషయం తన దృష్టికి వచ్చిందని ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ తెలిపారు. దీనిపై పీసీఐ ఛైర్మన్ కూడా స్పందించడాన్ని చూశానని చెప్పారు. తక్షణమే ఈ జోవోను ఉపసంహరించుకునేలా చూడాలని యూనియన్ నేతలు కోరారు. జర్నలిస్టు సంఘాలు, సంపాదకులు, పార్టీలు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నాయని వివరించారు. తమ విజ్ఞప్తిని పరిశీలిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని సమావేశం అనంతరం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సుబ్బారావు తెలిపారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.