ETV Bharat / city

'అందరినీ అరెస్ట్ చేసినా.. 10 మందితోనైనా చలో విజయవాడ' నిర్వహిస్తాం'

ఉద్యోగ సంఘాల నేతలు
ఉద్యోగ సంఘాల నేతలు
author img

By

Published : Feb 2, 2022, 12:09 PM IST

Updated : Feb 2, 2022, 1:26 PM IST

12:06 February 02

ప్రభుత్వం చేసిన గాయం కంటే కరోనా తీవ్రమైందేమీ కాదు..

మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాల నేతలు

Employees Unions Leaders on PRC: ప్రభుత్వ తప్పుడు లెక్కలతో ఉద్యోగుల వేతనాలు చెల్లించి.. జీతాలు పెరిగాయన్న అపోహ కల్పిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. పీఆర్సీ తగ్గిస్తే జీతాలు ఎలా పెరుగుతాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. పాత బకాయిలను పేస్లిప్పుల్లో చూపించి జీతాలు పెరిగినట్లు భ్రమింపజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా చనిపోయిన వారికి సైతం జీతాలు చెల్లించేశారని మండిపడ్డారు. చలో విజయవాడకు అనుమతి ఇచ్చి మళ్లీ ఇప్పుడు నిరాకరించారని.. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఉద్యోగులు పెద్దఎత్తున తరలివస్తారని నేతలు తెలిపారు.

దొంగ లెక్కలు చెప్పి మోసం చెయ్యొద్దు

వేతన స్కెల్​పై దొంగ లెక్కలు చెప్పి మోసం చేయొద్దు.. ఐఏఎస్ అధికారులకు ఉద్యోగులంతా తెలివి తక్కువ వాళ్ళలా కనిపిస్తున్నామా. ఏమి తెలియకుండానే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామని అధికారులు భావిస్తున్నారా? ఘర్షణ వైఖరి విడనాడి ప్రభుత్వం సానుకూల ధోరణి అవలంబించాలి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో.. చలో విజయవాడపై సీపీ నిర్ణయం వెనక్కు తీసుకున్నారు. ఎంత అణగదొక్కయాలని చూస్తే ఉద్యమం అంత ఉద్ధృతమవుతుంది -వెంకట్రామిరెడ్డి, పీఆర్సీ సాధన సమితి నేత

ప్రభుత్వం నిర్భందించిన కార్యక్రమం నిర్వహించి తీరుతాం..

ప్రభుత్వం నిర్బంధం విధించినా 'చలో విజయవాడ' కార్యక్రమం నిర్వహించి తీరుతాం.. ఉద్యోగులు తమ వేతన స్లిప్​లను అగ్గి మంటతో కాదు కడుపు మంటతో తగుల బెట్టారు. -సూర్యనారాయణరావు, పీఆర్సీ సాధన సమితి నేత

మాట మీద లేని ప్రభుత్వం అంతా రివర్స్ చేస్తోంది..

రివిజ్డ్ పే స్కెల్ వేసే తొందరలో మనుషులు చేసే పనిని మిషన్ల ద్వారా చేసి ప్రభుత్వం తప్పులు మీద తప్పులు చేస్తోంది.. మాట మీద లేని ప్రభుత్వం అంతా రివర్స్ చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన వేతనాలను, పెన్షన్ లను ఎవరూ హర్షించటం లేదని గుర్తించాలి.. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వానికి మాట మార్చే, మనసు మార్చుకునే జబ్బు వచ్చిందని, కరోనా కంటే దాని తీవ్రత ఎక్కువ.. ముందు అనుమతి ఉందని చెప్పి ఇప్పుడు లేదంటున్నారు. ప్రభుత్వం చేసిన గాయం కంటే కరోనా తీవ్రమైందేమీ కాదు.. అందరినీ అరెస్ట్ చేసినా కనీసం 10 మందితోనైనా ఉద్యమం నిర్వహించి తీరుతాం. -బండి శ్రీనివాసరావు, పీఆర్సీ సాధన సమితి నేత

ఇదీ చదవండి:

Chinthamani Drama: ఒక క్యారెక్టర్ బాగోలేకపోతే.. నాటకాన్ని ఎలా నిషేధిస్తారు: హైకోర్టు

Last Updated : Feb 2, 2022, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.