ETV Bharat / city

పోలవరం రీ టెండరింగ్‌పై పీపీఏ ఆందోళన - jagan government

పోలవరం టెండర్ల రద్దు వ్యవహారాన్ని విరమించుకుంటే మంచిదని... రీ టెండరింగ్ విధానం ప్రాజెక్ట్‌ను అనిశ్చితిలోకి నెట్టివేస్తుందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. రీ టెండరింగ్‌ను విరమించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు పీపీఏ ముఖ్య కార్యనిర్వాహణాధికారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

పోలవరం రీ టెండరింగ్‌పై పీపీఏ ఆందోళన
author img

By

Published : Aug 17, 2019, 6:06 AM IST

పోలవరం టెండర్ల రద్దుతోపాటు రివర్స్‌టెండరింగ్ విధానం మంచిది కాదంటూ... గతంలోనే హెచ్చరించిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ... మరోసారి ఘాటుగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం రీ టెండరింగ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో... ఈ విధానం ఊహించని పరిణామాలకు దారితీస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు పీపీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి... నీటిపారుదలశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు లేఖ రాశారు. ప్రిక్లోజర్, రీటెండరింగ్ ఆలోచనలను విరమించుకోవాలని సూచించారు. కేంద్రప్రభుత్వం ఈ అంశంపై ఒక వైఖరి తీసుకునే వరకైనా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో చర్చించిన అంశాలను ఆర్కే జైన్ మరోసారి గుర్తుచేశారు. రీటెండరింగ్ వల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరగడంతోపాటు... నిర్మాణ జాప్యం జరుగుతుందన్నారు. ప్రాజెక్ట్ సకాలంలో పూర్తికాకుంటే ప్రయోజనాలు ఆలస్యంగా అందుతాయని పేర్కొన్నారు. ఆలస్యం సామాజికంగా-ఆర్థికంగా ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఈ అంశంపై ఈనెల 13న హైదరాబాద్‌లో చర్చించి ఆందోళన వ్యక్తం చేసిన పోలవరం ప్రాజెక్ట్‌ అధారిటీ... 3 రోజుల వ్యవధిలోనే మరో లేఖ రాయడం గమనార్హం.

ఇదీ చదవండీ...

ఏపీలో పెట్టుబడులు పెట్టండి... సీఎం జగన్ ఆహ్వానం

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్.....కూలి పనులు ముంగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న కూలీల ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో6 గురు గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యావసర వైద్యం అందించిన వైద్యులు ఓ మహిళ మార్గం మధ్యలోనే మృతి చెందదని తెలిపారు. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లి కూలిపనులకు వెళ్లి తిరిగి గోరంట్ల వస్తున్న ప్యాసింజర్ ఆటోని గుంటూరు నుండి అమరావతి వెళుతున్న టాటా మ్యాజిక్ ఆటో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వద్ద ఢీకొట్టింది. దింతో ఆటోలో ఉన్న వారు ప్రమాదానికి గురయ్యారని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Body:విజువల్స్..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.