మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఈఎస్‌ఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా అచ్చెన్న న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
కేసు వివరాలు
తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ప్రభుత్వం.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్‌ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: