ETV Bharat / city

మామిడి పండ్ల పంపిణీలో తపాలా! - మామిడి పండ్లు సరఫరా చేస్తున్న తపాలా ఉద్యోగులు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ తపాలా శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భాగ్యనగరంలో ఉత్తరాలు పంచే ఉద్యోగులు ప్రస్తుతం మామిడి పండ్లను చేరవేస్తున్నారు. ఇదేంటి అనుకుంటున్నారా? అవును నిజం. అయితే ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

తెలంగాణ తపాలా శాఖ వినూత్న కార్యక్రమం
తెలంగాణ తపాలా శాఖ వినూత్న కార్యక్రమం
author img

By

Published : May 8, 2020, 5:25 PM IST

తెలంగాణాలోని తపాలాశాఖ.. జంటనగరాల్లో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతుకు-వినియోగదారుడికి వారధిగా నిలిచింది. ఉత్తరాలు పంచే ఉద్యోగులు ప్రస్తుతం మామిడి పండ్లను చేరవేస్తున్నారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, తెలంగాణ తపాలా సర్కిల్‌ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కె.సంధ్యారాణి, ఉద్యాన శాఖ కమిషనర్‌ వెంకటరెడ్డిలు సంయుక్తంగా మామిడి పండ్లను తపాలాశాఖ ద్వారా పంపించే కార్యక్రమానికి పచ్చ జెండా ఊపారు.

మొదటిరోజే తపాలాశాఖకు చెందిన వాహనాల ద్వారా 2,180 కేజీల మామిడి పండ్లను గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు తపాలాశాఖ చేరవేసింది. మొత్తం 436 పెట్టెలు ఇళ్లకు చేరగా.. మియాపూర్‌ పరిసరాల్లో ఎక్కువ మొత్తం మామిడిని ఇంటికి చేర్చారు. తర్వాత స్థానంలో గోల్కొండ, బేగంపేట ప్రాంతాలు నిలిచాయి. మామిడిపండ్లు కావాలనుకునేవారు.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 79977 24925, 79977 24941 నంబర్లను సంప్రదించవచ్చు.

ఇదీ చూడండి:'సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.