ETV Bharat / city

రోడ్డు ప్రమాదంలో పొన్నాల మనవడు మృతి - konduri drupath

గచ్చిబౌలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. కాంగ్రెస్​ నేత పొన్నాల లక్ష్మయ్య బంధువు మృతి చెందాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ద్రుపథ్
author img

By

Published : Aug 13, 2019, 11:13 AM IST

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ద్రుపథ్

హైదరాబాద్‌ గచ్చిబౌలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాంగ్రెస్​ నేత పొన్నాల లక్ష్మయ్య బంధువు కొండూరి ద్రుపథ్​ దుర్మరణం పాలయ్యాడు. పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడైన ద్రుపథ్​ ద్విచక్రవాహనంపై వెళ్తూ డివైడర్​ను ఢీకొనడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పొన్నాల లక్షయ్య ఆస్పత్రికి వెళ్లారు.

వరంగల్​ జిల్లాకు చెందిన 22 ఏళ్ల ద్రుపథ్ గచ్చిబౌలిలోని ఖాజాగూడలో నివాసం ఉంటున్నాడు. మాదాపూర్​లో డిజిటల్​ మార్కెటింగ్​ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడు. గచ్చిబౌలి చౌరస్తా సమీపంలో వేగం నియంత్రించలేక డివైడర్​ను ఢీకొనడం వల్ల మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ​

ఇవీ చూడండి : గోమాతను కాపాడి... ప్రేమను చాటుకున్న పాడి రైతన్న

Intro:HYD_TG_43_12_SHAMIRPET_ACCIEDENT_3DEATH_UPDATE_AB_TS10016

Body:యాంకర్ : దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నా కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సంఘటన శామీర్పేట్ వద్ద రాజీవ్ రహదారిపై సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వాయిస్: హైదరాబాద్ పట్టణములోని నాగోల్ కు చెందిన కిషోర్ చారి స్థిరాస్తి వ్యాపారం చేస్తూ స్థిర పడ్డారు. ఆయన భార్య భారతి, కొడుకులు సుధాంశు, తనీష్ లతో కలిసి 2018 మార్చి లో కొన్న తన సొంత కారు ఈకో స్పోర్ట్స్లో ఆయనే డ్రైవింగ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలోని పలు దైవ క్షేత్రాలను దర్శించుకుని సోమవారం తిరుగు ప్రయాణం అయ్యాడు. శామీర్పేట్ సమీపంలోకి రాగానే మీతి మీరిన వేగంతో వస్తూ డివైడర్ ను ఢీకొని అవతలి వైపు రోడ్లో వస్తున్న కారును డికోట్టింది. ఈ ప్రమాదంలో కిషోర్, భారతి, సూదాంశులు అక్కడికక్కడే మృతిచెందారు. ముందు సీట్లో కూర్చున్న భారతి కారు ఢీకొన్న దాటికి అద్దంలో నుంచి బయటకు వచ్చింది. తనీష్ తీవ్రంగా గాయపడగా అతని పరిస్థితి విషమంగా ఉంది. మరో కార్లో ఉన్న రాజు, మహేష్ లకు కూడా గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం అల్వాల్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కిషోర్ కుటుంబ నేపథ్యం... కిశోర్ చారి స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట కాగా ఆయన తండ్రి నాగార్జున సాగర్ కుడి కాలువ వద్ద ఉద్యోగం చేస్తూ ఇక్కడ వచ్చి స్థిర పడ్డారు. కిశోర్ కుటుంబం కొన్ని రోజుల క్రితం మియాపూర్ లో ఉండగా గత15 ఏళ్లుగా నాగోల్ లో ఉంటున్నారు. రెండేళ్ల నుంచి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. చిన్న కొడుకు తనీష్ దివ్యాంగుడు. కిశోర్ ప్రస్తుతం నాగోల్ బీజేపీ ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే కిషోర్ మృతి పట్ల ఎల్ బి నగర్ బీజేపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Conclusion:బైట్: నవీన్ రెడ్డి, సి ఐ, శామీర్పేట్. విజువల్స్ ftp లో పంపాను. ప్రవీణ్, మేడ్చల్, 9394450238 మరిన్నీ విజువల్స్ 36 స్లగ్ లో ఉన్నాయి వాడుకోగలరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.