ETV Bharat / city

రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు

author img

By

Published : Aug 23, 2022, 5:23 PM IST

Updated : Aug 23, 2022, 6:54 PM IST

MLA Rajasingh తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్​ విధించారు. రాజాసింగ్​ అనుచర వర్గం, వ్యతిరేక వర్గాలు భారీగా కోర్టు వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

RAJA SINGH
RAJA SINGH

Rajasingh arrest: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ను హైదరాబాద్​లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్... రాజాసింగ్‌కు 14రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. రాజాసింగ్‌కు మద్దతుగా భారీగా కోర్టు వద్దకు ఆయన అనుచరులు వచ్చారు. మంగళ్‌హాట్ పీఎస్‌లో ఖదీర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అనంతరం ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. అన్ని పీఎస్‌లల్లో నమోదైన కేసులు ఒకే ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేయనున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో నాంపల్లి కోర్టు సమీపంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత: నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాంపల్లిలో రాజాసింగ్‌కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. మరోవైపు రాజాసింగ్ వర్గీయుల ఆందోళన చేయడంతో వాతావరణం రణరంగాన్ని తలపించింది. ఇరువర్గాల నినాదాలతో కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఇరువర్గాలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై వివిధ పీఎస్‌ల్లో ఫిర్యాదులు అందాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ వెల్లడించారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, బాలాపూర్, కుషాయిగూడ పీఎస్​ల పరిధిలోనూ ఫిర్యాదులు వచ్చాయని సీపీ తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు చోట్ల కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. రాచకొండ పరిధిలోని చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి నిరసనలు జరిగాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కేసులు: రాష్ట్రవ్యాప్తంగా రాజాసింగ్‌పై ఆరు చోట్ల కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌లోనే రాజాసింగ్‌పై నాలుగు చోట్ల కేసులు నమోదయ్యాయని తెలిపారు. మంగళ్‌హాట్, బహదూర్‌పుర, డబీర్‌పురా, బాలానగర్‌, పంజాగుట్ట, బాలాపూర్ పీఎస్‌ల్లో కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి, నిజామాబాద్‌లోనూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

రాజాసింగ్​ సస్పెండ్​: ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పార్టీ క్రమశిక్షణ సంఘం భావించింది.

ఈ మేరకు రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తక్షణమే తప్పిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు పేర్కొంది. వచ్చే నెల 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోరింది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 23, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.