ETV Bharat / city

YS Sharmila Hunger Strike : 'ఇదేందక్కా ఇది.. దీక్షకు తీసుకొచ్చి పైసలు లేవంటారా?'

తెలంగాణలో ప్రతి వారం వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల (YSRTP President YS Sharmila) ప్రభుత్వానికి వ్యతిరేకంగా... నిరుద్యోగ దీక్ష(YS Sharmila Hunger Strike) చేపడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ సారి ఆమె దీక్ష సమయంలో రెండు ఆసక్తికర విషయాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఒకటైతే... ఆమె దీక్షలో కుర్చోనేందుకు వచ్చామని.. ఇప్పుడు పైసలు ఇవ్వమంటున్నారని అడ్డకూలీలు ఆందోళనకు దిగారు. ఈ రెండు విషయాలు షర్మిల దీక్షకన్నా ఆసక్తి కలిగిస్తున్నాయి.

ys sharmila
ys sharmila
author img

By

Published : Sep 21, 2021, 1:25 PM IST

'ఇదేందక్కా ఇది.. దీక్షకు తీసుకొచ్చి పైసలు లేవంటారా?'

తెలంగాణలో మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో వైఎస్​ఆర్ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP President YS Sharmila) చేపట్టే నిరుద్యోగ దీక్ష ( YS Sharmila Hunger Strike On Unemployment) వద్ద అడ్డా కూలీలు ఆందోళనకు దిగారు. మేడిపల్లి కెనరా నగర్ బస్​స్టాపు వద్ద ఉన్న కూలీల వద్దకు... ఆ పార్టీకి చెందిన రాఘవ రెడ్డి వెళ్లి సాయంత్రం 6 గంటల వరకు దీక్షలో ఉండాలని కోరినట్లు వెల్లడించారు. అలా వచ్చిన ప్రతిఒక్కరికి రూ.400 ఇస్తామని 50 మంది కూలీలను ఆర్టీసీ బస్సులో దీక్ష స్థలికి తీసుకొచ్చారు. వచ్చినప్పటినుంచి డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని చూసిన వారికి నిరాశే ఎదురైంది. డబ్బులు అడిగినా ఇవ్వకపోవడంతో కూలీలు ఆందోళనకు దిగారు. మీడియాతో మాట్లాడుతున్న కూలీలను... నాయకులు నచ్చచెప్పి అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లారు.

ఏమి లేదు సార్​.. ఒకసారు వంద మంది ఆడోళ్లను తీసుకుని రమ్మన్నాడు. అయితే నేను 55 మందిని దీక్ష కోసం తీసుకొచ్చాను. ఇప్పుడు వాళ్లను వద్దని అన్నారు. వీళ్లంతా డబ్బులు కోసం వచ్చారు. డబ్బులిస్తామంటేనే కూలీ మానుకుని వచ్చాము సార్.. ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటున్నారు. మేమేం చేయాలి. మా డబ్బులు మాకిప్పిస్తే మేము పోతాం సార్.. అటూ కూలీ పని పోయింది.. ఇటు డబ్బులు ఇవ్వట్లేదు.

- మహిళ అడ్డా కూలీలు

ఇదిలా ఉండగా షర్మిల చేపట్టే దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో నాయకులు, కార్యకర్తలు దీక్ష స్థలి వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర: వైఎస్‌ షర్మిల

ప్రజాప్రస్థానం పేరుతో అక్టోబర్ 20వ తేదీ నుంచి పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేపట్టనున్నట్లు వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YSRTP President YS Sharmila) ప్రకటించారు. నిరుద్యోగ సమస్య (Unemployment problem in telangana) పరిష్కారమయ్యే వరకూ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏడాదిపాటు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర (Praja Prasthanam Padayatra) సాగుతుందని... జీహెచ్​ఎంసీ మినహా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేస్తామని స్పష్టం చేశారు. రోజుకు 12-15 కి.మీ మేర పాదయాత్ర (Praja Prasthanam Padayatra) ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేవెళ్లలో ప్రారంభించి... చేవెళ్లలోనే ముగిస్తానని షర్మిల తెలిపారు.

ఇదీ చూడండి: బంగారంపై పెట్టుబడులకు ఇదే సరైన సమయమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.