తెలంగాణలోని నల్గొండలో నిత్య పెళ్లికొడుకుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పెళ్లి పేరుతో విలియమ్స్ అనే వ్యక్తి 19 మంది మహిళలను మోసం చేశాడు. నిందితుడు నల్గొండలోని ఓ చర్చిలో పియానో వాయిస్తుంటాడు. ఇదే అదనుగా భావించిన విలియమ్స్.. చర్చికి వచ్చే యువతులను, మహిళలను లోబర్చుకున్నాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. 19 మందిని మోసం చేశాడు.
ఈ తతంగమంతా మొదటి భార్య ఫిర్యాదుతో.. విలియమ్స్ బాగోతం బయటకు వచ్చింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. విలియమ్స్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఇంతలో నిందితుడు గుండెపోటు వచ్చిందంటూ... ఆసుపత్రిలో చేరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి :