ETV Bharat / city

విశాఖ న్యాయస్థానంలో జనసేన నేతలకు ఊరట - విశాఖ ఎయిర్​పోర్ట్​ ఘటన

Police Case on Janasena Activists: విశాఖ న్యాయస్థానంలో జనసేన నేతలకు ఊరట లభించింది. 61 మందిని రూ.10 వేల పూచీకత్తుపై న్యాయస్థానం విడుదల చేసింది. 9 మందికి ఈనెల 28 వరకు రిమాండ్‌ విధించింది. 9 మందిపై 307 సెక్షన్‌ తొలగించి 326సెక్షన్‌గా మార్పు చేసింది.

visakha airport
visakha airport
author img

By

Published : Oct 16, 2022, 7:14 PM IST

Updated : Oct 17, 2022, 6:38 AM IST

Police Case on Janasena Activists: విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే కేసులో జనసైనికులకు న్యాయస్థానంలో ఊరట లభించింది. 92 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఆదివారం రాత్రి విశాఖ ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు 70 మంది హాజరుపరిచారు. వీరిలో 61 మందికి పదివేల రూపాయలు వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. A1- A 9 నిందితుల పై ఉన్న హత్యాయత్నం సెక్షన్‌ తీవ్ర గాయం కేసుగా మార్చి రిమాండ్ విధించారు. పోలీసులు ప్రొసీజర్ విషయంలో తగిన నిబంధనలు పాటించలేదని న్యాయమూర్తి ఆక్షేపించారని జనసేన లీగల్ సెల్ ప్రతినిధులు తెలిపారు.

పవన్​కల్యాణ్​ బస చేసిన నోవాటెల్‌ హోటల్‌ వద్దకు జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మరోవైపు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇదిలావుంటే పవన్​కల్యాణ్​ ప్రస్తుత పరిస్థితిపై ట్విటర్​లో స్పందించారు. ఏపీ పోలీసులు.. నన్ను జనసేన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశించారు. నేను బస చేస్తున్న హోటల్​ నుండి మాత్రమే జనసేన కార్యకర్తలను చూడగలుగుతున్నానని అక్కడి దృశ్యాలను ట్విటర్​లో పోస్ట్​ చేశారు.

  • Our beloved AP police under the Eminent Leadership of CM
    Sri Thanos barred me not to hold Janasena programs, no rallies, no meetings.Left me with this option only… from my Room window. pic.twitter.com/3oatyfAtHI

    — Pawan Kalyan (@PawanKalyan) October 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

విశాఖన్యాయస్థానంలో జనసేన నేతలకుఊరట

Last Updated : Oct 17, 2022, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.