గోదావరి వరద ఉద్ధృతి ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో 7 రోజులు పనులు నిలిచిపోగా... ప్రస్తుతం తెరిపినివ్వడంతో స్పిల్ వే, స్పిల్ ఛానెల్ కాంక్రీటు పనులు చేస్తున్నట్లు జలవనరుల శాఖ వెల్లడించింది. కొండ తవ్వకం, గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్, మట్టి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. స్పిల్ వే గేట్లు బిగించేందుకు ట్రూనియన్ బీమ్ తయారీకి షటరింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 11 బ్లాకుల్లో 44 గడ్డర్లు ఏర్పాటు చేశారు. అలాగే రోడ్ నిర్మించేందుకు అనువుగా షటరింగ్, డెక్ షీటింగ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: శిరోముండనం కేసుపై కేంద్ర మంత్రికి వర్ల రామయ్య లేఖ