విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి రెండుసార్లు లేఖ రాయటాన్ని పీఎంవో నిర్థారించింది. దీనిపై నిర్ణీత గడువులోగా సరైన సమాధానం పంపాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం)కు సూచించింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఈనెల 10, 20వ తేదీల్లో రెండు లేఖలు ప్రధాన మంత్రికి రాసిన లేఖలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. స్పందించిన పీఎంవో.. దీపం విభాగానికి ఆ లేఖలు పంపి తగు సమాధానం పంపాలని సూచించనట్లు పేర్కొంటూ బదులిచ్చింది.
ఇదీ చదవండి: