ETV Bharat / city

దుబ్బాకలో భాజపాది చరిత్రాత్మక విజయం: ప్రధాని మోదీ - దుబ్బాకలో భాజపా విజయంపై స్పందనల వార్తలు సిద్దిపేట జిల్లా

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా గెలుపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇది చరిత్రాత్మక విజయం అని ట్వీట్​ చేశారు. ఈ విజయం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తమకు మరింత శక్తినిస్తుందని పేర్కొన్నారు. తమ పార్టీని ఆశీర్వదించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంటుందని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్​ షా ట్వీట్​ చేశారు.

pm-narendra
pm-narendra
author img

By

Published : Nov 11, 2020, 8:38 AM IST

తీవ్ర ఉత్కంఠకు దారితీసిన దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. చివరివరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఓట్ల పోరులో భాజపా విజయం సాధించడంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు.

"దుబ్బాక ఒక చరిత్రాత్మక విజయం. భాజపాకు తమ ఆశీస్సులు అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత సేవ చేసేందుకు ఈ విజయం మాకు మరింత శక్తినిస్తుంది. మా కార్యకర్తలు ఎంతో కృషి చేశారు."

- మోదీ

"దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసిన భాజపా కార్యకర్తలకు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి శుభాభినందనలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవడంలో మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోంది."

- కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

"దుబ్బాక ఉప ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించడలో కీలక పాత్ర పోషించిన భాజపా కార్యకర్తలకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి అభినందనలు. అధికార తెరాస అవినీతిని, రాచరిక రాజకీయాలను వ్యతిరేకిస్తూ, ప్రధాని మోదీపై మరింత విశ్వాసముంచుతూ.. ఈ ఫలితాలు వెలువడ్డాయి"

- భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా

ఇదీ చదవండి:

విశాఖలో ఆక్రమణలన్నింటి వెనుకా నేతలే : ఎంపీ విజయసాయిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.