పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021ను ఉన్నత విద్యామండలి అక్టోబర్లో నిర్వహించనుంది. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాల వారీగా నిర్వహిస్తున్న ఈ పరీక్షను అన్నింటికీ కలిపి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షలు పూర్తి కానందున అక్టోబరులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, ర్యాంకులు కేటాయించి ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్‌టీయూలు మినహా మిగతా అన్ని వర్సిటీల్లోని పీజీల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. అన్ని వర్సిటీల్లో కలిపి 12వేల వరకు సీట్లు ఉండగా.. 50వరకు వివిధ రకాల కోర్సులున్నాయి. ఒక్కో కోర్సుకు ఒక్కో పరీక్ష నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: High Court: సొంత రాష్ట్రంలోనే హెచ్ఆర్సీ కార్యాలయం ఉండాలి