ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(Intermediate First year Exams) రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలైంది. ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దంటూ తల్లిదండ్రుల సంఘం ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసింది. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. తల్లిదండ్రుల సంఘం తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ వేశారు.
పరీక్షలు లేకుండా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోకి ప్రమోట్ అయిన విద్యార్థులకు మొదటి ఏడాది పరీక్షలను(Inter first year exams) నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. కరోనా కారణంగా మే నెలలో జరగాల్సిన ఇంటర్ ప్రథమ(Intermediate First year Exams), ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించలేదు. ఇంటర్ ద్వితీయ విద్యార్థులకు తొలి ఏడాదిలో వచ్చిన మార్కులనే కేటాయించి ఇటీవల ఫలితాలు కూడా వెల్లడించారు. ప్రథమ ఏడాది విద్యార్థులను మాత్రం రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేశారు.