ETV Bharat / city

DENTAL PG SEATS : దంత వైద్య పీజీ సీట్ల భర్తీపై హైకోర్టులో వ్యాజ్యం..

author img

By

Published : Sep 30, 2022, 5:10 PM IST

HC ON DENTAL PG SEATS : దంత వైద్య పీజీ సీట్ల భర్తీపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఇన్‌ సర్వీస్ సీట్లను నాన్ సర్వీస్ కోటాకు బదలాయిస్తున్నారని ప్రభుత్వ వైద్యుడు ప్రసన్నకుమార్ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సీట్లు బదాలాయిస్తున్నారని.. దీని వల్ల ప్రభుత్వ వైద్యులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.

PETITION IN HC
PETITION IN HC

PETITION IN HC : డెంటల్ పీజీ నియామకాల్లో ప్రభుత్వ డాక్టర్లకు కేటాయించిన ఇన్ సర్వీస్ సీట్లను అక్రమంగా నాన్ సర్వీస్ కోటాకి బదలాయిస్తున్నారంటూ హైకోర్టులో ఓ ప్రభుత్వ వైద్యుడు వ్యాజ్యం దాఖలు చేశారు. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా తదుపరి నోటిఫికేషన్ ఇవ్వకుండా అక్రమంగా ఈ సీట్లను బదాలాయిస్తున్నారని పిటిషనర్‌ తరుఫు న్యాయవాది వాదించారు. దీనివల్ల ప్రభుత్వ వైద్యులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ డాక్టర్లుగా పనిచేస్తున్న తమకే అన్యాయం జరుగుతుందంటూ తన పిటిషన్​లో పేర్కొన్నారు.

న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. 2018 డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనల ప్రకారం తప్పనిసరిగా రెండు, మూడు కౌన్సెలింగ్​లు నిర్వహించాలని న్యాయవాది కోరారు. కౌన్సెలింగ్ నిర్వహించకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ సీట్స్ బదలాయిస్తున్నారని న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్​కి కేటాయించిన సీట్లలో ఎవరిని నియమించవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.