దిశ హత్యాచార ఘటన అనంతరం మహిళల రక్షణ కోసం హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే బెంగుళూరు మెట్రో రైలులో పెప్పర్ స్ప్రేకు అనుమతి ఇస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా మెట్రో రైళ్లలో మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎండీ వెల్లడించారు.