తెలంగాణలోని మెదక్ జిల్లా చిన్నశంకంరపేట మండలం కామారం గ్రామ శివారులో చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఓ చిరుత తన రెండు పిల్లలతో కలిసి తిరుగుతుండగా తాము చూశామని కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై మహ్మద్ గౌస్ వారిని సమీప భవనాల్లోకి తరలించారు.
జిల్లాలోని కామారం గ్రామ శివారులో కొంతమంది కూలీలు గుడిసెలు నిర్మించుకుని బండలు కొట్టే పని చేస్తున్నారు. రాత్రివేళ నిద్రిస్తున్న క్రమంలో వారి సమీపంలోకి చిరుతపులి రావడంతో నానాజీ అనే వ్యక్తి బిగ్గరగా అరుస్తూ.. అందరిని అప్రమత్తం చేశాడు. చిరుతను చూసి భయాందోళనకు గురైన కూలీలంతా మంటపెట్టి కర్రలతో తరిమే ప్రయత్న చేశారు. అయినా అది అక్కడే సంచరిస్తుండంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై అటవీ అధికారులతో మాట్లాడి బోను ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై మహమ్మద్ గౌస్ సూచించారు.
ఇదీ చదవండి: VIDEO VIRAL: కారుతో ఢీకొట్టాడు..అడిగితే దురుసుగా ప్రవర్తించాడు