ETV Bharat / city

సర్వర్‌ సమస్యతో పింఛన్ల పంపిణీకి ఇబ్బంది - పింఛన్ల పంపిణీలో సాంకేతిక సమస్యలు

రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కానుక కింద పింఛన్లను ప్రభుత్వం బ్యాంకులో జమ చేసినా సాంకేతిక కారణాల వల్ల పలు ప్రాంతాల్లో విత్​డ్రా కాలేదని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) అధికారులు తెలిపారు.

pensions  Distribution
పింఛన్ల పంపిణీ
author img

By

Published : Aug 2, 2021, 9:29 AM IST

రాష్ట్రంలో 60.50 లక్షల మంది లబ్ధిదారులకు వైఎస్‌ఆర్‌ కానుక కింద పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.1,455.87 కోట్లను బ్యాంకులకు జమ చేసినా సాంకేతిక కారణాల వల్ల శనివారం కొన్ని బ్యాంకుల నుంచి పలు జిల్లాల్లో నగదు విత్‌డ్రా కాలేదని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రభావం పింఛన్ల పంపిణీపై పడింది. బ్యాంకుల్లో ఏర్పడిన సర్వర్‌ సమస్యే ఇందుకు కారణం. అధికారిక లెక్కల ప్రకారం ఆదివారం(పంపిణీ తొలిరోజు) రాత్రి 8 గంటల వరకు 48.63 లక్షల మందికి రూ.1,157.75 కోట్ల మేర (80.39శాతం) పంపిణీ చేశారు. మూడు రోజులపాటు పంపిణీకి అవకాశం ఉన్నందున నగదు విత్‌డ్రా సమస్య ఏర్పడిన ప్రాంతాల్లో సోమవారం పంపిణీ చేస్తామని వెల్లడించారు. అనంతపురం జిల్లాలో రూ.126 కోట్లకుగాను రూ.105 కోట్లు పంపిణీ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలోనూ రూ.20 కోట్ల మేర నగదు విత్‌డ్రా కాలేదనిఅధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని సోమవారం పంపిణీ చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని కొన్ని పురపాలక సంఘాల పరిధిలో, తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని సచివాలయాల పరిధిలో నగదు తీసుకునేందుకు సమస్య ఏర్పడింది. విజయనగరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కాస్త ఆలస్యంగా పంపిణీ ప్రారంభమైంది. విజయవాడ నగరపాలక సంస్థ, మరికొన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండీ.. accident: కారు- లారీ ఢీ.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.