డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేసిన 48 వేల660 మంది ఉద్యోగులలో 1200 మందిని తప్ప మిగిలిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయన్నారు పవన్ కల్యాణ్. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా 17 రోజులపాటు నాడు తెలంగాణ పరిధిలోవున్న ఆర్.టి.సి. ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలు చూశామని.... ప్రజలకు కష్టం కలగకుండా చూడవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఉద్యోగుల పట్ల ఉదారత చూపాలని, తెలంగాణ ఆర్.టి.సి. సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావును పవన్ కోరారు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపుపై పవన్ ఆందోళన - కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల తలపెట్టిన సమ్మెపై ప్రభుత్వం స్పందించాలని జనసేన అధినేత పవన్ అన్నారు. కార్మికుల డిమాండ్లను సానుభూతితో అర్థం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.