కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో... తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసినా వైద్యులు కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. వైద్యులు, సంబంధిత సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పి.పి.ఈ) కిట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడం దురదృష్టకరమన్నారు. 'ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా? అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన పి.పి.ఈ లు ఇవ్వకుండా రోగులకు వైద్యం అందించమనటం ధర్మం కాదు' అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మెడికల్ మాస్కులు, దుస్తులు, గ్లోవ్స్, కంటి అద్దాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సామాగ్రి లేకపోవటం వల్ల వైద్య సిబ్బంది ఆందోళనలో ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఎన్-95 మాస్కులు ఇవ్వకుండా, సాధారణ డిస్పోజబుల్ గౌన్స్ ఇవ్వడం సరికాదన్నారు. వైద్యుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ అన్నారు.
ఇదీ చదవండి: