రాజధాని విషయమై ప్రజల్లో గందరగోళం నెలకొందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ పరిస్థితి సర్వత్రా శ్రేయస్కరం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చిస్తామంటున్నారని... ఆ తర్వాత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామని జనసేనాని తెలిపారు. అభివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలో...? 4 భవనాలో..? అని భావించట్లేదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రాజకీయ జవాబుదారీతనం కోరుకుంటున్నామని పవన్ తెలిపారు
ఇదీ చదవండి: