జగన్ ప్రభుత్వం మరోసారి కక్షసాధింపు, మొండి వైఖరితో వ్యవహరించిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఎస్ఈసీని తొలగిస్తూ జారీచేసిన ఉత్తర్వుల ద్వారా తన వైఖరిలో మార్పు లేదని సీఎం నిరూపించుకున్నారన్నారు. ముఖ్య విషయాల్లో జగన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగానే ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కమిషనర్‌ను తొలగించడానికి అసలు ఇది సమయమా అని పవన్ ప్రశ్నించారు.
ప్రజలను కాపాడడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం... కక్ష తీర్చుకునే కార్యక్రమంలో మునిగిపోయిందని విమర్శించారు. కరోనా సమయాన ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే సమయం ఇదని.. ప్రభుత్వ కార్యాచరణ ఆ దిశగా ఉండాలని జనసేన కోరుకుంటున్నట్లు ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: