సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వీర జవాన్లకు వందనం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. వీర జవాన్ల త్యాగాలను త్రికరణశుద్ధితో స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 130 కోట్ల మంది భారతీయుల ప్రాణాల్ని అనుక్షణం రక్షించే జవాన్ల రుణాన్ని ఏమిచ్చినా తీర్చుకోలేమని పవన్ అన్నారు. దేశ ప్రజలందరి ప్రాణాల్ని రక్షించేందుకు తమ ప్రాణాల్ని అడ్డువేసే వారి ధీరత్వానికి కృతజ్ఞతాపూర్వక సెల్యూట్ చేస్తున్నానని పవన్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆలయాలపై దాడుల్లో రాజకీయ పార్టీల ప్రమేయం: డీజీపీ