ETV Bharat / city

సంజీవయ్య ఇంటిని.. స్మారక చిహ్నంగా మారుస్తాం: పవన్ కల్యాణ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంజలి ఘటించారు. సంజీవయ్య నిత్యస్మరణీయులన్న పవన్.. ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని చెప్పారు.

jsp
jsp
author img

By

Published : Oct 17, 2021, 1:34 PM IST

కర్నూలు జిల్లాలోని సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ట్విటర్ లో పోస్టు చేశారు. సంజీవయ్య నిత్యస్మరణీయులన్న పవన్.. ఆయన చేసిన సేవలకు గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం రూ.కోటి నిధి ఏర్పాటు చేయనున్నట్లు జనసేనాని తెలిపారు.

కడు పేదరికంలో పుట్టిన సంజీవయ్య అసాధారణ వ్యక్తిగా ఎదిగారని చెప్పిన పవన్.. వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు బీజాలు వేశారని కొనియాడారు. రెండేళ్లే సీఎంగా ఉన్నప్పటికీ.. సంజీవయ్య ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. హైదరాబాద్‌ పరిసరాల్లోని 6 లక్షల ఎకరాలు పేదలకు పంచారని, మొదటగా వృద్ధులు, వికలాంగుల పింఛన్లు ప్రారంభించింది సంజీవయ్యే అని పవన్ గుర్తు చేశారు. బోయలు, కాపు కులాలను బీసీల్లో చేర్చారని చెప్పారు. ఈ పోస్టుకు దామోదరం సంజీవయ్య ఇంటి ఫొటోలను జతచేశారు.

ఇదీ చదవండి: atchannaidu: ఎస్సీలను అణచివేయడమే వైకాపా నైజం: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.