ETV Bharat / city

చంద్రన్నా... నీకు అండగా మీముంటాం

author img

By

Published : Apr 9, 2019, 7:28 AM IST

పసుపు- కుంకుమ ద్వారా తమ జీవితాలు బాగుపడ్డాయని... రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కన్నవారు సైతం చూసుకోని ఈ రోజుల్లో... అన్నగా బాధ్యతలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... ఏడాదికి 10వేలు ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని మహిళలు చెబుతున్నారు.

అన్నగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్​... నీకు అండగా మీముంటాం.

పసుపు- కుంకుమ ద్వారా తమ జీవితాలు బాగుపడ్డాయని... రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కన్నవారు సైతం చూసుకోని ఈ రోజుల్లో... అన్నగా బాధ్యతలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... ఏడాదికి 10వేలు ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని మహిళలు చెబుతున్నారు. చంద్రన్న ఇచ్చిన డబ్బులు తమకు ఎంతగానో ఉపయోడపడుతున్నాయని... సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ చంద్రబాబే రావాలని ఆకాంక్షిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో...
గుంటూరు జిల్లా వినుకొండలో పసుపు-కుంకుమ లబ్ధిదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెదేపా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు సతీమణి లీలావతితో కలిసి నగరంలోని తెదేపా కార్యాలయం నుంచి బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు వందల మంది మహిళలు ర్యాలీ చేశారు. మళ్లీ చంద్రన్న ప్రభుత్వం రావాలని నినదించారు.
కృష్ణా జిల్లాలో...
తెదేపా ప్రభుత్వం పేదల, మహిళల పట్ల ఎంతో నిబద్ధత పనిచేస్తుందన్న చంద్రబాబు మాటలు అక్షరాలు నిజమని డ్వాక్రా సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. పసుపు-కుంకుమ పథకంలో మూడో విడత చెక్కులు మార్చుకోవడానికి మహిళలు బ్యాంకుల దగ్గర క్యూకట్టారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజవర్గంలో చెక్కులు మార్చుకున్న పలువురు మహిళలు ఆనందంతో మళ్లీ చంద్రన్న పాలనే రావాలని కోరారు.
తిరుపతిలో...
ఆడపడుచులకు ఆర్థిక చేయూతనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్ఠాత్మక పసుపు-కుంకుమ పథకం మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం పట్ల మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తిరుపతిలోని బ్యాంకులు వద్ద పొదుపు సంఘాల మహిళలు క్యూకట్టారు. సంక్షేమం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా కార్యక్రమాలు చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబుపై మహిళలు ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. అన్నలాగా... అక్కచెళ్లెల్లను ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో పసుపు కుంకుమ డబ్బు తీసుకునేందుకు పొదుపు సంఘాల మహిళలు పోటెత్తారు. దీంతో ఆముదాలవలస పట్టణంలో ఉన్న గ్రామీణ వికాస్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్,ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మరి కొన్ని బ్యాంకులు మహిళలతో కిటకిటలాడాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని .... మూడు విడతల్లో పదివేల రూపాయలు అందజేశారని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
కర్నూలులో....
పసుపు కుంకమ ద్వారా తమ జీవితాలు బాగుపడ్డాయని...కర్నూల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. కన్నవారు సైతం పట్టించుకోని ఈ రోజుల్లో .... అన్నగా ముఖ్యమంత్రి చంద్రబాబు పసుపు-కుంకమగా పదివేల రూపాయలు ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ డబ్బులు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని... మళ్లీ చంద్రన్నే మన ముఖ్యమంత్రిగా రావాలని ఆకాంక్షిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో....
ప్రకాశం జిల్లాలో పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు బ్యాంకుల వద్ద క్యూలు కట్టారు... పసుపు-కుంకుమ మూడోవిడత చెక్కులను మార్చుకునేందుకు వచ్చిన మహిళలతో బ్యాంకులన్నీ నిండిపోయాయి.. పిల్లలు ఫీజుల కట్టుకోడానికి, చిన్న చిన్న అవసరాలు తీర్చకోవటానికి ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు... ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దన్నగా...తమకు ఇచ్చిన సహకారాన్ని మరిచిపోలేమని తెలిపారు.
విశాఖ జిల్లాలో...
విశాఖజిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్​లో పెద్ద సంఖ్యలో మహిళలు చెక్కులు జమచేసి నగదు తీసుకున్నారు. మూడో దఫాగా 4000 రూపాయలు చేతికి రావటంతో హర్షం వ్యక్తం చేశారు.... అన్న గా ఆడపడుచులకు చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని... మళ్లీ చంద్రన్న పాలనే రావాలని కోరారు.
అనంతపురం జిల్లాలో...
అనంతపురంజిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వేలాదిగా మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ... మున్సిపల్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ చేశారు. మూడో విడత చెక్కులకు డబ్బులు జమచేసినందుకు సంబరాలు చేసుకున్నారు. డ్వాక్రా అక్క,చెల్లమ్మలకు పెద్ద అన్నగా ఉంటూ.... తమ కష్టాలను తీరుస్తున్నాడని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి...పోలవరంపై కేసీఆర్ కేసులన్నీ వెనక్కి తీసుకుంటారా: చంద్రబాబు

New Delhi, Apr 08 (ANI): Hurriyat Chairman and Kashmiri separatist leader, Mirwaiz Umar Farooq arrived at National Investigation Agency (NIA) office in Delhi today. He is being questioned in connection with Jammu and Kashmir (J and K) terror funding case. The agency had carried out a series of raids on separatists, including Mirwaiz last month.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.