ETV Bharat / city

పరిషత్ ఎన్నికలు: ఇప్పటివరకు ఏం జరిగింది..? - Andhra Pradesh Politics

రాష్ట్రంలో జట్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు యథాతథంగా పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 15 తర్వాత కోర్టు తీర్పును అనుసరించి ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉండనున్నాయి. 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

పరిషత్ ఎన్నికలు
పరిషత్ ఎన్నికలు
author img

By

Published : Apr 7, 2021, 5:08 PM IST

Updated : Apr 8, 2021, 6:24 AM IST

జట్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. 515 జడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. జడ్పీటీసీ బరిలో 2058 మంది, ఎంపీటీసీ స్థానాలకు 18,782 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఫలితాల వెల్లడిని మాత్రం హైకోర్టు నిలుపుదల చేసింది. ఈనెల 15 తర్వాత కోర్టు తీర్పును అనుసరించి ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. ఈ ఎన్నికల కోసం 27,751 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,46,71,002 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

నిలిచిపోయిన స్థాయి నుంచే మళ్లీ...

ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే... పరిషత్‌ ఎన్నికలకు నీలం సాహ్ని షెడ్యూలు ప్రకటించారు. గతంలో నిలిచిపోయిన స్థాయి నుంచి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. 8న పోలింగ్‌, 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించేలా షెడ్యూల్ విడులైంది. కానీ... న్యాయస్థానం తాజా ఆదేశాల ప్రకారం ఫలితాలు ఎప్పుడు వెల్లడయ్యేది 15న తేలనుంది. ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణపై దృష్టిపెట్టారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసొచ్చాక వరుస సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌, ఎన్నికల సంఘం కార్యదర్శి, అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌, ఇతర అధికారులతో సమావేశమై.... డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాక ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు.

ఏకగ్రీవాలు ఎన్ని..?

కిందటి ఏడాది మార్చిలో 9,984 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, వివిధ కారణాలతో వీటిలో 288 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిర్వహించలేదు. మిగతా 9,696 స్థానాల్లో 2,371 ఏకగ్రీవమైనట్లు పంచాయతీరాజ్‌శాఖ ఎస్‌ఈసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. 660 జడ్పీటీసీ స్థానాల్లో 8 చోట్ల ఎన్నికలు నిర్వహించట్లేదు. మిగిలిన 652 స్థానాల్లో 126 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాల్లో కడప, చిత్తూరు జిల్లాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. కడప జిల్లాలో 553 ఎంపీటీసీ స్థానాలకు 432 (78.11%), 50 జడ్పీటీసీ స్థానాలకు38 (76%) ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలో 858 ఎంపీటీసీ స్థానాలకు 433 (50.46%), 65 జడ్పీటీసీ స్థానాల్లో 30 (46.15%) ఏకగ్రీవమైనట్లు అధికారులు వివరించారు.

ఏకగ్రీవాలపై అభ్యంతరాలు...

పరిషత్ ఎన్నికల్లో ఏగ్రీవాలపై ప్రతిపక్ష పార్టీలు పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు ఇతరులను నామినేషన్ వేయనివ్వకుండా చేశారని ఆరోపించాయి. దీని గురించి తెదేపా సహా ఇతర పార్టీలు ఎస్​ఈసీకీ లేఖ రాశాయి. ఈ స్థాయిలో ఏకగ్రీవాలు కావడంపై అనుమానం వ్యక్తం చేశాయి. నిమ్మగడ్డ రమేశ్​కుమార్ ఎస్​ఈసీగా ఉన్నప్పుడు పలు పార్టీల నేతలు ఆయన్ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు.

కోర్టు బ్రేక్ ఎందుకు..?

ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక.. 28 రోజుల కోడ్ ఉండాలని గతంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని తెదేపా సహా ఇతర పార్టీలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. వాటిపై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్‌ విధించలేదంటూ హైకోర్ట్ సింగిల్ బెంచ్ బుధవారం పరిషత్ ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ప్రతిపక్షాలు స్వాగతించాయి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి.

హైకోర్టు గ్రీన్ సిగ్నల్...

సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని ఎస్​ఈసీ కోరింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేసింది. పరిషత్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్‍ఈసీ తరఫున న్యాయవాది సి.వి.మోహన్‍రెడ్డి వాదనలు వినిపించారు. 28 రోజుల కోడ్ ఉండాలనేది సుప్రీంకోర్టు ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని, ఈ ఎన్నికలకు కోడ్ నిబంధన వర్తింపచేయాల్సిన అవసరం లేదని ఎస్‍ఈసీ వాదించింది. రిట్ పిటిషన్ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేయట్లేదని, తెదేపా తరఫున పిటిషన్ వేయలేదని ఎస్‍ఈసీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఉన్నత న్యాయస్థానం అంగీకారం...

ఎన్నికల కోడ్‌కు కనీసం, గరిష్టం అంటూ నిబంధన లేదన్న ఎన్నికల సంఘం వాదనతో హైకోర్టు ఏకీభవించింది. పరిషత్ ఎన్నికల నిర్వహణకు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. తుది తీర్పునకు లోబడి ఎన్నికల నిర్వహణ జరగాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం మేరకు పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వెల్లడయ్యేది ఈనెల 15న తేలనుంది.

ఇదీ చదవండి:

రేపే పరిషత్ పోరు.. ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ...!

Last Updated : Apr 8, 2021, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.