ETV Bharat / city

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిలిపేయాలని కోరడమేంటి? - పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయని హైకోర్టు ధర్మాసనం ముందు ఎస్ఈసీ వాదనలు వినిపించింది. పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు.. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని ఎస్ఈసీ తరఫు న్యాయవాది వాదించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని నిలుపుదల చేయాలని కోరారు. ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన ఏజీ... కరోనా టీకా విషయంలో ప్రభుత్వం ఇచ్చిన వివరాల్ని ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోకుండా షెడ్యూల్ ఇచ్చిందన్నారు. ఏజీ వాదనలపై ఎస్ఈసీ తరఫు న్యాయవాది బదులిచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ap panchayat elections issue
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
author img

By

Published : Jan 19, 2021, 4:09 AM IST

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఈనెల 8న రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్నికల సంఘం హైకోర్టు ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీల్‌పై సోమవారం విచారణ జరిగింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని న్యాయ సూత్రాలు స్పష్టంచేస్తున్నాయని ఎస్ఈసీ తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. స్థానిక సంస్థల గడువు 2018 ఆగస్టులో ముగిసిందని.. ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీపై ఉందని కోర్టుకు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం గతేడాది మార్చిలో ఎస్ఈసీ ప్రకటన జారీ చేసిందని..ఆ తర్వాత కరోనా వ్యాప్తి వల్ల ఎన్నికల్ని వాయిదా వేసిందని తెలిపారు.

టీకా ప్రక్రియపై ప్రభావం ఉండదు: ఎస్ఈసీ

రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత..ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిర్ణయం తీసుకొని గత నవంబర్ 17న ప్రొసీడింగ్స్ ఇచ్చిందని కోర్టుకు వివరించారు. కరోనా విషయంలో ప్రభుత్వం ఎస్ఈసీ ముందు ఉంచిన వివరాల్ని పరిశీలన చేసిందన్నారు. ఎన్నికల నిర్వహణకు కరోనా టీకా ప్రక్రియ ప్రభావం చూపదని ఎస్ఈసీ నిర్ణయానికి వచ్చిందని పలు అంశాల్ని అద్యయనం చేశాకే ఈఏడాది జనవరి 8న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని ఆ వివరాల్ని సింగిల్ జడ్డి పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికలను నిలుపుదల చేశారని వాదించారు. కర్నాటక, బీహార్, రాజస్థాన్, కేరళలో కరోనా వ్యాప్తి కారణంగా ఎన్ని కల్ని వాయిదా వేయాలంటూ దాఖలైన వ్యాజ్యాల్లో అక్కడి హైకోర్టులు జోక్యం చేసుకోలేదని...ఆ నిర్ణయాలను సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని ధర్మాసనానికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌కు దురుద్దేశం ఆపాదిస్తోందని... ఎన్నికలు నిర్వహించడం వల్ల కమిషనర్‌కు వ్యక్తిగత లబ్ధి ఏముంటుందని ధర్మాసనానికి తెలిపారు. ఎన్నికలను నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని...సింగిల్ జడ్జీ ఉత్తర్వులపై... స్టే ఇవ్వాలని అని కోరారు.

ప్రభుత్వ వివరాల్ని పరిగణనలోకి తీసుకోలేదు

సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎస్ఈసీ అప్పీల్ దాఖలు చేయడం తగదని ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అప్పీల్ కు విచారణార్హత లేదన్నారు. కరోనా టీకా విషయమై ప్రభుత్వం సమర్పించిన వివరాల్ని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ముందుగా అనుకున్న ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్​ఈసీ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సంప్రదింపుల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల్ని ఎస్​ఈసీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. టీకా ప్రక్రియలో 23 శాఖలు పాత్ర వహించాలని...ప్రత్యేక పరిస్థితులు, ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల్ని వాయిదా వేయాలని ఎస్ ఈసీని కోరామని వాదించారు.

టీకా ప్రక్రియపై ధర్మాసనం ప్రశ్నల వర్షం

ధర్మాసనం స్పందిస్తూ .. కేటగిరిల వారీగా ఎంతమందికి టీకా ఇస్తున్నారని ఆరా తీసింది. టీకా ప్రక్రియ ఎన్నికలను పోలినట్లు ఉంటుందా ? అని ఏజీని ప్రశ్నించింది. కేంద్రాల వారీగా రోజుకు ఎంతమందికి టీకా ఇస్తారని అడిగింది. టీకా లభ్యత , ప్రజల స్పందన ఆధారంగా టీకా ప్రక్రియ ఉంటుందని ఏజీ ధర్మాసనానికి తెలిపారు. టీకాకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఓవైపు టీకా , మరోవైపు ఎన్నికలు నిర్వహించడం కష్టమన్నారు.

రెండూ నిర్వహించగలిగితే అభ్యంతరం లేదు: కేంద్రం

కేంద్ర ప్రభుత్వం తరపున సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదనలు వినిపిస్తూ....టీకా షెడ్యూల్‌కు సంబందించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలుకు సమయమివ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 23 నుంచి షెడ్యూల్ ప్రారంభం కానున్న తరుణంలో గడువు ఇవ్వలేమని పేర్కొంది. అయితే..టీకా, ఎన్నికల నిర్వహణ రెండింటినీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించగలిగితే తమకు అభ్యంతరం లేదని ఏఎస్‌జీ బదులిచ్చారు.

ఇదీ చదవండి:

దేవినేని ఉమాకు మంత్రి కొడాలి నాని హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.