ETV Bharat / city

koushik reddy: తెరాసలో చేరిన పాడి కౌశిక్​ రెడ్డి - పాడి కౌశిక్‌ రెడ్డి వార్తలు

కాంగ్రెస్‌ మాజీ నేత పాడి కౌశిక్‌ రెడ్డి(koushik reddy) తెరాసలో చేరారు. తెలంగాణలోని హైదరాబాద్​ ప్రగతి భవన్​లో కేసీఆర్​ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. హుజూరాబాద్​కు పలువురు కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.

padi koushireddy joined in trs party today at pragathi bhavan in hyderabad
తెరాసలో చేరిన పాడి కౌశిక్​ రెడ్డి
author img

By

Published : Jul 21, 2021, 7:32 PM IST

తెరాసలో చేరిన పాడి కౌశిక్​ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం హుజూరాబాద్​ కాంగ్రెస్‌ మాజీ నేత పాడి కౌశిక్‌ రెడ్డి(koushik reddy) తెరాస తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్​ ప్రగతి భవన్​లో కేసీఆర్​ సమక్షంలో తెరాసలో చేరారు. కౌశిక్​ రెడ్డికి సీఎం కేసీఆర్​ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. కౌశిక్​తో పాటు అతని అనుచరులు కూడా కారెక్కారు.

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూరాబాద్‌ టికెట్‌ తనకే వస్తుందని కౌశిక్​ రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది. మాదన్నపేటకు చెందిన విజయేందర్‌ అనే కార్యకర్తతో కౌశిక్‌రెడ్డి ఫోన్​లో మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ తెరాస టికెట్‌ తనకే ఖాయమైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని.. ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.4-5వేలు ఇస్తానని అతడికి తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజయేందర్‌కు కౌశిక్‌రెడ్డి సూచించారు.

కాంగ్రెస్​కు రాజీనామా

ఈ ఫోన్​ సంభాషణ సోషల్​ మీడియాలో వైరల్​గా మారటంతో కాంగ్రెస్​ కౌశిక్​ రెడ్డికి షోకాజ్​ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ కేసీఆర్​ సమక్షంలో తెరాసలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్​ రెడ్డి హుజూరాబాద్​ నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

చేరికలు

హుజూరాబాద్​ ఉప ఎన్నిక నేపథ్యంలో కౌశిక్​ రెడ్డి తెరాసలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని తెరాస వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా వివిధ పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకుంటుంది. ఈ మధ్య మాజీ మంత్రి ముద్దసాని దామోదర్​ రెడ్డి కొడుకు కశ్యప్​ రెడ్డిని తెరాసలో చేర్చుకున్నారు. అంతకాకుండా దళిత బంధు పథకం అమలుకు హుజూరాబాద్​ను ఫైలెట్​ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంచుకుంది. ​హుజూరాబాద్​ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు కూడా నిధులు విడుదల చేసింది. అయితే ఇక్కడ తెరాస నుంచి పోటీ చేసేది ఎవరో ఇంతవరకు ఆ పార్టీ ప్రకటించలేదు. గులాబీ అధినేత కేసీఆర్​ బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నారని సమాచారం. ఇందుకు సర్వేలు కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు:

Etela: పాదయాత్రలో నాపై దాడికి కుట్ర: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.