జ్వరం, పొడిదగ్గుతో ఎవరైనా బాధపడుతుంటే 104, 1902 నెంబర్లకు ఫోన్ చేసి తెలపాలని సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. దీనిపై గ్రామాలు, పట్టణాల్లోని వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. వ్యాయామం చేయడం సహా పౌష్టికాహారం తీసుకోవాలని హితవు పలికారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: