ప్రభుత్వ సలహాదారుగా ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు(chandrasekhar reddy appointed as adviser to ap gov news). ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ఆయన సలహాదారుగా వ్యవహారించనున్నారు. రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా.. చంద్రశేఖర్ రెడ్డిపై పలు అంశాల్లో ఆరోపణలు ఉన్నందున ఆయనకు సలహాదారు పదవి ఇవ్వొద్దంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. అయినప్పటికీ సర్కార్.. చంద్రశేఖర్ రెడ్డిని సలహాదారుగా నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ చదవండి
NOTIFICATION : రాష్ట్రంలో మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్