తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో అంబులెన్సులను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. హైదరాబాద్ ఒక మెడికల్ హబ్‌గా వెలుగొందుతుందని.. అంబులెన్సులపై కేసీఆర్ మొండి వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. జగన్ వెంటనే ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడానని.. ఇదే విషయంపై కేంద్రానికి లేఖ రాస్తామని సోము వీర్రాజు వెల్లడించారు.
ఇదీ చదవండీ... సరిహద్దులో మారని తెలంగాణ పోలీసుల తీరు.. వెనక్కి వెళ్తున్న అంబులెన్సులు